ఇక ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సునామీలా…!

Published on Mar 28, 2020 7:38 am IST

సీతారామరాజు గా చరణ్ ఎంట్రీ అదిరింది. ఎప్పటిలాగే రాజమౌళి ఊహకు మించిన అనుభూతి పంచారు. చరణ్ పాత్రను ఆయన పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు గూస్ బంప్స్ కలిగించింది. కళ్ళలో కసి, కండల్లో పవర్ చూపిస్తూ రామరాజు పాత్రలో చరణ్ మారణాయుధం కంటే ప్రమాదకరంగా అనిపించాడు. ఇక తెలంగాణా యాసలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఆ పాత్రను తారా స్థాయిలో ఎలివేట్ చేసింది. అల్లూరిగా చరణ్ తెరపై భీభత్సం సృష్టించడం ఖాయం అని అర్థమైపోయింది.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు, మే 20న ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో కొమరం భీమ్ గా ఇంట్రో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా జక్కన్న బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిపోయింది. చరణ్ ఇంట్రడక్షన్ సూపర్ రెస్పాన్స్ అందుకున్న తరుణంలో వారు అంతకు మించిన స్థాయిలో ఎన్టీఆర్ వీడియో ఉండాలని కోరుకోవడం సహజం. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి రాజమౌళి పై ఒత్తిడి పెరగడం ఖాయం. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎంట్రీ సునామీలా ఉంటుందని టాక్. మరి చూడాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆయన ఎలాంటి అనుభూతిని ఇస్తారో.

సంబంధిత సమాచారం :

X
More