ఎన్టీఆర్ ఫ్యాన్స్ చరణ్ కోసం ఇంతలా..!

Published on Mar 27, 2020 9:11 am IST

ఎన్టీఆర్, రాంచరణ్ పరిశ్రమలో మంచి మిత్రులు. ఇక వీరిద్దరూ కలిసి భారీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం టైటిల్ రౌద్రం రణం రుధిరం గా నిర్ణయించడం జరిగింది. ఈ టైటిల్ మరియు మోషన్ పోస్టర్ కి ఫ్యాన్స్ ని భారీ రెస్పాన్స్ దక్కింది. కాగా నేడు రామ్ చరణ్ జన్మదినం కావడంతో అల్లూరి కొరకు భీమ్ పేరుతో ఓ స్పెషల్ మరియు సర్ప్రైజ్ వీడియో విడుదల చేయనున్నట్లు నిన్న చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఐతే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో కలిసినటిస్తున తరుణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం చరణ్ పై శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. అభిమాన సామరస్యం పాటిస్తూ ఎన్టీఆర్ కి సమానంగా వారు చరణ్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నేడు రానున్న ఆ స్పెషల్ వీడియోలో రాజమౌళి ఇవ్వనున్న స్పెషల్ సర్ప్రైజ్ ఏమైఉంటుంది ఆసక్తిగా ఎదురుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More