జక్కన్న కు కూడా కాస్త టైం ఇవ్వలిగా..!

Published on Jul 8, 2020 3:43 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రూధిరం”. ఇప్పటికే 80 శాతం పూర్తి కాబడిన ఈ చిత్రంపై తాజాగా పలు వార్తలు బయటకొచ్చాయి. ఈ చిత్రంలో బాహుబలి సినిమాను మించిన రేంజ్ ఎలివేషన్ సీన్లు ఉంటాయని అలాగే బలమైన ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయని తెలిసింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా అప్డేట్స్ విషయానికి వస్తే ఇప్పుడు రాజమౌళిపై కాస్త ఒత్తిడి ఉందనే చెప్పాలి. ఈ చిత్రం లో కొమరం భీమ్ రోల్ చేస్తున్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సహా టీజర్ వీడియోను కూడా విడుదల చేసారు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ పుట్టిన రోజే కావడంతో కొమరం భీమ్ గా తారక్ ఎలా ఉంటాడో అని ఆ రోజు కోసం ఎంత గానో ఎదురు చూశారు.
కానీ లాక్ డౌన్ కారణంగా రాజమౌళి టీం పనులకు ఆటంకం కలిగింది. దీనితో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు.

ఇదిలా ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్20 ఫస్ట్ లుక్ పోస్టర్ కు అనౌన్స్ మెంట్ రావడంతో తారక్ ఫ్యాన్స్ నుంచి రాజమౌళి పై ఒత్తిడి పడటం మొదలైంది. ఇది సర్వ సాధారణమే అయినప్పటికీ జక్కన్న కు కూడా కాస్త సమయం ఇవ్వాలి కదా? ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. సో రాజమౌళి కాస్త లేట్ అయినా కూడా తారక్ ఫ్యాన్స్ ను ఏమాత్రం నిరాశ పరచడం జరగదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More