తెల్లాపూర్ లో యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్న ఎన్.టి.ఆర్

Published on Aug 7, 2013 5:07 pm IST

NTR

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘కందిరీగ’ ఫేం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ తో కలిసి చేస్తున్న సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెల్లాపూర్ ఏరియాలో ఎన్.టి.ఆర్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే జూబ్లిహిల్స్ ఏరియాలో మొదలైంది. సమంత హీరోయిన్ గా నటిసున్న ఈ సినిమాకి ఈ మధ్య మెలోడీ లవ్ ట్రాక్స్ తో బాగా ఫేమస్ అయిన అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సీనియర్ నటులైన జయసుధ, షాయాజీ షిండే, జయప్రకాశ్ రెడ్డి, అజయ్ లు కీల పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :