యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. అనుకున్న రిలీజ్ టైంకి తక్కువ టైం ఉండడంతో ఈ చిత్ర టీం అసలు గ్యాప్ లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నారు.
ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ అనుకున్న తేదీకి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తుండడంతో షూటింగ్ డేస్ తగ్గుతున్న కొద్దీ షూటింగ్ ప్రొగ్రెస్ ని వేగవంతం చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ స్టొరీకి వక్కంతం వంశీ కథని అందించాడు.


