ఇద్దరు భామలతో స్టెప్స్ వేస్తున్న ఎన్.టి.ఆర్

Published on Feb 16, 2014 5:55 pm IST

jr-ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ పాటలో ఎన్.టి.ఆర్ ఇద్దరు భామలు అనగా సమంత – ప్రణితతో కలిసి స్టెప్పులేస్తున్నాడు. ఈ పాటని రభస సినిమా కోసం షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం రభస షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ పాటలో ఎన్.టి.ఆర్ – సమంత – ప్రణితలు మంచి స్టెప్స్ తో ఆక్కట్టుకుంటారని, అలాగే ఈ పాట సినిమాలో ఒక హైలైట్ అవుతుందని ఆశిస్తున్నారు.

ఈ మాస్ ఎంటర్టైనర్ కి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ‘కందిరీగ’ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. సమ్మర్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆడియో కుడా ఏప్రిల్ లేదా మే లో రిలీజ్ అవుతుంది.

‘రభస’ సినిమా హై డోస్ కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, అది కూడా సెకండాఫ్ లో ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :