ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ అదిరింది…!

Published on Nov 13, 2019 7:16 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా తన లేటెస్ట్ లుక్ తో దర్శనమిచ్చాడు. వైట్ టి షర్ట్ పై రెడ్ జాకెట్ తో ఉన్న ఎన్టీఆర్ లుక్ కూల్ గా ఉంది. ఎన్టీఆర్ సౌత్ ఇండియా లెవెల్ లో ప్రముఖ శీతల పానీయం అప్పీ ఫిజ్ కి ప్రచార కర్తగా ఉన్నారు. ఆ ప్రోడక్ట్ ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ ట్విట్టర్లో ఓ కాంటెస్ట్ నిర్వహించారు. అప్పీ ఫిజ్ కూల్ డ్రింక్ తో పాటు మీరు తినడానికి ఇష్టపడే ఐటమ్ ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోండి అని ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా అప్పీ ఫిజ్ ప్రచార కర్తగా సల్మాన్ ఖాన్ ఉండగా, సౌత్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ నియమించబడ్డారు.

ఇక ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుందట. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజమౌళి నిరవధికంగా ప్రత్యేక సెట్స్ లో షూటింగ్ నిర్వహిస్తున్నారట. బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు చేస్తుండగా, ఎన్టీఆర్ మరియు చరణ్ లు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More