ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్…చాలా ట్రెండీగా ఉన్నాడే..!

Published on Jul 14, 2020 11:41 pm IST


ఆర్ ఆర్ ఆర్ పుణ్యమా అని ఎన్టీఆర్ దాదాపు మూడేళ్లు కోల్పోనున్నారు. 2019, 2020లతో పాటు 2021లో కూడా ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతుందన్న నమ్మకం లేదు. దీనితో ఆయన దర్శనం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా సందడి చేయని ఎన్టీఆర్ అరుదుగా బయట కనిపిస్తూ ఉంటారు. కాగా ఇటీవల ఓ చిన్న వీడియోలో ఎన్టీఆర్ కనిపించి ఫ్యాన్స్ ని ఫిదా చేశారు.

ఎన్టీఆర్ అనేక వ్యాపార ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు. దేశంలో మొబైల్ రిటైల్ చైన్స్ లో ఒకటైన సెలెక్ట్ మొబైల్స్ కి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సెలెక్ట్ మొబైల్స్ షో రూమ్ ఈనెల 17న విజయవాడలో ప్రారంభం కానుంది. దాని ప్రచార వీడియోలో ఎన్టీఆర్ ట్రెండీ లుక్ లో కనిపించడం జరిగింది. కాగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More