ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ షెడ్యూల్ ఎన్ని రోజులంటే?

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ షెడ్యూల్ ఎన్ని రోజులంటే?

Published on Apr 17, 2025 10:00 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో 31వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి జాయిన్ కానున్నాడు.

ఇక ఎన్టీఆర్ జాయిన్ అవగానే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ మూడు వారాల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఏప్రిల్ 22 నుంచి మే 15 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో తారక్‌తో పాటు పలువురు కీలక నటీనటులు నటించనున్నారు.

ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు