ఒకేసారి రెండు సినిమాలు చేయాలన్న ఆలోచనలో ఎన్టీఆర్‌?

Published on Jan 5, 2022 3:01 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ సిల్వర్ స్కీన్‌పై కనిపించి దాదాపు మూడేళ్లు కావస్తుంది. అయితే ఎన్టీఆర్‌ హీరోగా నటించిన “ఆర్ఆర్ఆర్” చిత్రం రిలీజ్ ఇటీవల మళ్లీ వాయిదా పడడంతో ఎన్టీఆర్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా బాగా నిరాశ చెందినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ ఇకపై సమయం వృధా చేయకూడదని అనుకుంటున్నాడట.

ఇందులో భాగంగానే త్వరలో కొరటాల శివతో ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. అంతేకాదు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు స్క్రిప్ట్‌ని కూడా ఫైనల్ చేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. అయితే ఈ రెండు సినిమాలను ఒకేసారి చేస్తూ, వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేయాలని ఎన్టీఆర్‌ పట్టుదలతో ఉన్నాడట. చూడాలి మరీ బుచ్చిబాబు సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది.

సంబంధిత సమాచారం :