ఆగిపోయిన ఎన్.టి.ఆర్- పూరిల గోవా షూటింగ్

ఆగిపోయిన ఎన్.టి.ఆర్- పూరిల గోవా షూటింగ్

Published on Oct 21, 2014 9:30 AM IST

jr-ntr-puri-jaganath
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఈ నెల 15న హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకొని గోవా షెడ్యూల్ కోసం వెళ్ళారు. అనుకున్న దాని ప్రకారం ఈ రోజు నుంచి గోవా షెడ్యూల్ ప్రారంభం కావాలి. కానీ గోవా షెడ్యూల్ ఆగిపోవడంతో డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరియు అతని టీం ఈ రోజు తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడానికి కారణం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్కర్స్ యూనియన్ చేస్తున్న స్ట్రైక్. వర్కర్స్ తమ జీతాలను పెంచాలని గత కొద్ది రోజులుగా షూటింగ్ లు అన్నిటినీ ఆపేసి తెలుగు చలన చిత్ర మండలితో చర్చలు జరుపుతున్నారు. కానీ అవి ఒక కొలిక్కి రాకపోవడంతో షూటింగ్స్ ఏవీ జరగడం లేదు. అప్పటికీ బండ్ల గణేష్ చర్చలు ముగిసాక ఎంత సాలరీ పెంచితే ఆ ప్రకారమే జీతాలు ఇస్తానన్నప్పటికీ వర్కర్స్ ససేమిరా అనడంతో ఎన్.టి.ఆర్ పూరి సినిమా ఆగిపోవాల్సి వచ్చింది.

ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీం అనుకున్న రిలీజ్ తేదీకి తక్కువ టైం ఉండడంతో శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ సమస్య వల్ల ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి.

తాజా వార్తలు