యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీ కోసం ఓ స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ ని వేస్తున్నారని ఇది వరకే తెలియజేశాం. ఈ స్పెషల్ సెట్లో 11 రోజులు షూటింగ్ చేయనున్నారు. ప్రస్తుతం సెట్ పనులు చివరి దశలో ఉన్నాయి.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబందించిన 25% షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న హైదరబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే ఈ చిత్ర టీం వైజాగ్ లో ఓ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తోంది. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ చేసుకోవడం, దానికి తక్కువ సమయం ఉండడం వలన అనుకున్న టైంకి ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం కంటిన్యూగా షూటింగ్ చేస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


