ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా కోసం రాజమౌళి.. ?

Published on Jul 10, 2018 4:10 pm IST

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. కాగా బాహుబలి లాగే ఈ చిత్రం పై కూడా నేషనల్ వైజ్ గా హైప్ తీసుకురావడానికి రాజమౌళి ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దాదాపు ‘ఆర్ఆర్ఆర్’‌ను రూ.300కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. అందుకే తెలుగు, తమిళ్‌ తో పాటు ఎక్కువ మార్కెట్ కలిగిన హిందీలో కూడా ఈ చిత్రం పై హైప్ రావాలి.

కాగా రాజమౌళి హిందీలో మార్కెటింగ్ కోసం అక్కడ స్టార్ దర్శకనిర్మాత అయిన కరణ్ జోహార్‌ ను సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే ‘ఆర్ఆర్ఆర్’కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈచిత్ర షూటింగ్ లో మొదటగా ఎన్టీఆర్ పాల్గొంటాడు. ఎన్టీఆర్ పై కొంత భాగం చిత్రీకరించిన తర్వాత రామ్ చరణ్ షూట్ లో జాయిన్ అవనున్నాడు.

సంబంధిత సమాచారం :