బిగ్‌బాస్ వన్ కంటెస్టెంట్ కు ఛాన్స్ ఇప్పించిన ఎన్టీఆర్ !

Published on Aug 6, 2018 10:00 am IST

జూ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న బిగ్‌బాస్ వన్ కంటెస్టెంట్ ఆదర్శ్ బాలకృష్ణ, త్రివిక్రమ్ – ఎన్టీఆర్‌తో ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తూ వైరల్ అవుతుంది.

అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ‘అరవింద సమేత’లో ఆదర్శ్ బాలకృష్ణ నటించడం పై ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. బిగ్‌బాస్ వన్ కంటెస్టెంట్ గా చివరి నిముషంలో బిగ్‌బాస్ వన్ విన్నర్ గా నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు ఆదర్శ్. ఆ సందర్భంలో ఎన్టీఆర్, ఆదర్శ్ తో ఏం బాధ పడొద్దని మనం కలిసి ఓ సినిమా చేయబోతున్నాం అని మాట ఇచ్చారట. ఆ కారణంగానే ‘అరవింద సమేత’లో ఆదర్శ్ బాలకృష్ణకు అవకాశం ఇప్పించి తన మాటను ఎన్టీఆర్ నిలబెట్టుకున్నారని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :

X
More