“RRR”లో ఎన్టీఆర్ ప్రతీ మాట తూటా లెక్క.!

“RRR”లో ఎన్టీఆర్ ప్రతీ మాట తూటా లెక్క.!

Published on Jul 13, 2021 12:47 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం తుది దశ షూటింగ్ లో ఉంది. అయితే మేకర్స్ నుంచి అప్డేట్స్ కూడా అధికారికంగా ఇస్తూ వస్తున్నారు. మరి ఇంకో రెండు రోజుల్లో బ్లాస్టింగ్ అప్డేట్ కూడా రానుంది.

అయితే ఈ గ్యాప్ లోనే ఈ చిత్రంపై మరో ఆసక్తికర అంశం వినిపిస్తుంది. ఈ సినిమాలో తారక్ కొమరం భీం గా కనిపిస్తున్నా సంగతి తెలిసిందే. మరి తన పాత్రలో ముఖ్యంగా దేశభక్తి పై వచ్చే డైలాగ్స్ అన్నీ అదిరిపోతాయట. మామూలుగానే తారక్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో తెలిసిందే. మరి అలాంటిది అలాంటి డైలాగ్స్ చెప్తే ప్రతీ మాట కూడా తూటా లెక్కనే పేలుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ టాకే వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు