పొలిటికల్ ఎంట్రీ పై ఎన్టీఆర్ అదే రియాక్షన్.!

Published on Mar 13, 2021 4:01 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఒక పక్క తన సినిమా లైఫ్ లోని అలాగే లేటెస్ట్ గా స్మాల్ స్క్రీన్ పై మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మరింత బిజీ కానున్నారు. అయితే తారక్ ఒక గొప్ప నటుడిగానే కాకుండా గొప్ప వాక్చాతుర్యం కలవాడు అని కూడా తెలిసిందే. అద్భుతమైన ప్రసంగం అలాగే మంచి ఆలోచన ధోరణి కూడా ఉండడంతో తన పొలిటికల్ ఎంట్రీ అనేది కూడా ఎంతో ఆసక్తికరమైన ప్రశ్నగా ఎప్పటి నుంచో మిగిలి ఉంది.

అయితే ఈ సున్నితమైన అంశాన్ని తారక్ పలు మార్లు ప్రస్తావనలోకి వచ్చినపుడు జస్ట్ అలా మాట్లాడి వదిలేసే వాడు. మరి ఈరోజు “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రెస్ మీట్ లో కూడా ఈ తరహా ప్రశ్నలు మళ్ళీ ఎదురయ్యాయి. దీనికి తారక్ కూడా అంతే ఉత్సాహంగా తన సమాధానాన్ని ఇచ్చారు. దీనికి బదులుగా నా సమాధానం ఆల్రెడీ అందరికీ తెలిసిందే అని ప్రతీ సారి చెప్పేదే అని మళ్ళీ అదే రియాక్షన్ ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీ కోసం ఇప్పుడు మాట్లాడే సమయమూ కాదు సందర్భం కాదని తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చి తనదైన మార్క్ లో చెప్పారు.

సంబంధిత సమాచారం :