తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ భోగి శుభాకాంక్షలు

Published on Jan 14, 2020 8:18 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు ప్రపంచ వ్యాప్తంగా భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలియజేశారు. తెలుగు ప్రజల పెద్ద పండుగగా భావించే సంక్రాంతి ని పురస్కరించుకొని ఎన్టీఆర్ తన అభిమానులకు పండుగ దినం ఉదయాన్నే బెస్ట్ విశెష్ చెప్పి ప్రత్యేకత చాటుకున్నారు.

ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విరామంలో ఉన్నారు. దీనితో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి ఘనంగా జరుపుకోనున్నారు. ఇటీవలే ఆయన వైజాగ్ షెడ్యూల్ నందు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ నందు కేవలం ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఉద్యమ వీరులైన వీరిద్దరి పాత్రలకు కాల్పనికత జోడించి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరిస్తున్నారు. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ జులై 30న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :