చరణ్ కి సారీ చెప్పిన ఎన్టీఆర్

Published on Mar 27, 2020 10:12 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో చరణ్ కి సారీ చెప్పారు. తాను పంపిన బర్త్ డే గిఫ్ట్ చరణ్ కి చేరకపోవడమే ఇందుకు కారణం. సారీ బ్రదర్ నీకు బర్త్ డే గిఫ్ట్ పంపాను. గత రాత్రే నీకు గిఫ్ట్ ఇవ్వమని రాజమౌళి ఇంటికి పంపాను. రాజమౌళి సంగతి తెలుసుగా ఎప్పటి లాగే ఇన్ టైం డెలివరీ చేయకుండా డిలే చేశారు అని చమత్కరించాడు. మరి రాంచరణ్ బర్త్ డే గిఫ్ట్ రాజమౌళికి ఎందుకు పంపాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఐతే నేడు 10:00 గంటలకు భీమ్ ఫర్ రామరాజు పేరుతో ఓ స్పెషల్ వీడియో రావాల్సివుండగా అది డిలే అయ్యింది. దాన్ని సూచిస్తూ ఎన్టీఆర్ ఇలా చమత్కరించాడు.

ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. రెండు రోజుల విడుదలైన టైటిల్ లోగో మోషన్ పోస్టర్ కి విశేష ఆదరణ దక్కింది. డి వి వి దానయ్య 400కోట్లకు పైగా వ్యయం తో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More