మైత్రి మూవీస్ కొరకు ఎన్టీఆర్ దిగారు

Published on Oct 23, 2019 11:14 am IST

మైత్రి మూవీ మేకర్స్, కొత్త నటులతో సాంకేతిక నిపుణులతో తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘మత్తు వదలరా’. కొద్దిరోజు క్రితం ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఒక గదిలో పాతకాలపు టీవీ లో చిరంజీవి ఖైదీ సినిమా వస్తుండగా, గోడపై సూపర్ మాన్ గెటప్ లో ఎన్టీఆర్ ఫోటో, టేబుల్ పై ఫోటో తో కూడిన స్మార్ట్ ఫోన్, రక్తపు మరకలతో రెండు ఇన్లాండ్ లెటర్స్, ఒక బిల్, ఓకే పార్సీల్ బాక్స్, గోడలపై ఒక కస్టమర్ ని ఉద్దేశిస్తూ ఒక కొటేషన్. ఇలా టైటిల్ పోస్టర్ లో మూవీ పై ఆసక్తి పెరిగేలా క్లూస్ ఇస్తూ డిజైన్ చేశారు.

కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయడం జరిగింది. తన బ్రదర్స్ అందరూ పెద్దవారైపోయారు, కాలం ఎంత వేగంగా పెరిగెడుతుంది. సింహా కోడూరి, భైరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మత్తువదలరా చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అని ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని పంచుకున్నారు. ఈ చిత్ర హీరో సింహ కోడూరి యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర చేసిన బాలుడు అని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. రితేష్ రానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని చిరంజీవి, హేమలత నిర్మిస్తుండగా, కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More