20ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన యంగ్ టైగర్.

Published on Jul 9, 2020 9:07 am IST

ఇండస్ట్రీ హిట్ సింహాద్రి విడుదలై నేటికి 17ఏళ్ళు. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ మొత్తం తుడిచిపెట్టిన సింహాద్రి ఎన్టీఆర్ కెరీర్ లో గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. హీరోగా ఎన్టీఆర్ కి సింహాద్రి 7వ సినిమా. అప్పటికే ఆది సినిమాతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఉన్నాడు. దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ తో తన మొదటి చిత్రంగా స్టూడెంట్ నంబర్ వన్ చేశారు. అది ఆయన డెబ్యూ మూవీ కాగా మంచి హిట్ అందుకుంది. ఎన్టీఆర్ కి కూడా మొదటి హిట్ మూవీ స్టూడెంట్ నంబర్ వన్. ఇక రెండో చిత్రం ప్రయత్నాలలో ఉన్న రాజమౌళి ఓ మాస్ సబ్జెక్టు సిద్ధం చేసుకొని…హీరో బాలయ్యను కలిశారు.

కారణం ఏదైనా బాలయ్య ఆ సబ్జెక్టు పట్ల ఆసక్తి చూపించలేదు. దీనితో రాజమౌళి తన మొదటి మూవీ హీరో ఎన్టీఆర్ ని కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఒకే చేశాడు. అలా ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి 2003 జులై 9న విడుదలైన సరికొత్త రికార్డులు నమోదు చేసింది. వసూళ్లు, 100 డేస్ సెంటర్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ వయసు అప్పటికి కేవలం 20ఏళ్ళు మాత్రమే. అంత చిన్న వయసులో ఎన్టీఆర్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు.

సంబంధిత సమాచారం :

More