సమంత ను ఆటపట్టిస్తున్న ఎన్టీఆర్!

Published on Oct 18, 2021 7:00 pm IST


బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సమంత ఈ కార్యక్రమం కి గెస్ట్ గా రావడం తో షో మరింత ఆసక్తి కరం గా మారింది. ఈ షో లో జూనియర్ ఎన్టీఆర్ సమంత కి ఒక ప్రశ్న వేసి ఆట పట్టించడం జరిగింది.

ఇక ఫోటోలో కుక్కను చూపించి ఏ జాతికి చెందినది అంటూ ఎన్టీఆర్ ప్రశ్న వేశారు. సమంత సరైన సమాధానం చెప్పినప్పటికీ, అందులోనే మరొక ప్రశ్న వేసి జూనియర్ ఎన్టీఆర్ ఆట పట్టించారు. తాజాగా విడుదల అయిన ప్రోమో లో ఇలా ఉండటం తో ఈరోజు అసలు ఏం జరుగుతుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జెమిని టీవీ లో ప్రసారం అవుతున్న ఈ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం కి పలువురు సినీ ప్రముఖులు హాజరు అవుతూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం :

More