చిరు యాక్షన్ కి ఎన్టీఆర్ రియాక్షన్..!

Published on Mar 26, 2020 12:12 pm IST

మోస్ట్ అవైటెడ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి ఉగాది కానుగా బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ అనే మూడు అక్షరాల టైటిల్ వెనకున్న పవర్ ఫుల్ పదాలను పరిచయం చేశారు. రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ తో పాటు, ఎన్టీఆర్ మరియు చరణ్ లతో కూడిన మోషన్ పోస్టర్ అటు మెగా ఫ్యాన్స్ తోపాటు నందమూరి ఫ్యాన్స్ కి ఆహ్లాదం పంచింది. కాగా ఈ టైటిల్ మరియు మోషన్ పోస్టర్ పై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

నిన్న ఉగాది సందర్భంగా ట్విట్టర్ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ పై ప్రసంశలు కురిపించారు. ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ అద్భుతం అని కొనియాడారు. ఈ ప్రశంస పై ఎన్టీఆర్ స్పందించారు. ఆయన స్పందనకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్, చిరు ట్విట్టర్ ఎంట్రీకి తనదైన శైలిలో ఆహ్వానం పలికారు.

సంబంధిత సమాచారం :