బాబాయ్ ని ఫాలో అవుతున్న అబ్బాయ్…?

Published on Nov 11, 2019 7:17 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్లో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. కాగా తాజాగా ఎన్టీఆర్ పై ఓ ఆసక్తికర వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది.

ఎన్టీఆర్ త్వరలో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయనున్నాడట. ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించనున్న ఎన్టీఆర్ ఇకపై తాను నటించే చిత్రాలలో నిర్మాణ భాగస్వామిగా ఉంటూ, ఇతర హీరోల చిత్రాలు కూడా నిర్మించాలని భావిస్తున్నారట. బాలయ్య కూడా ఈ ఏడాది ఎన్ బి కె ఫిల్మ్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ కూడా నిర్మాతగా మారనున్నాడు అనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. మహేష్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో పాటు నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఇప్పటికే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More