లేటెస్ట్ : లొకేషన్స్ వేటలో NTR 30 టీమ్

లేటెస్ట్ : లొకేషన్స్ వేటలో NTR 30 టీమ్

Published on Nov 10, 2022 3:01 AM IST

ఇటీవల దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీం పాత్రలో నటించి తన అత్యద్భుత పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీని గతంలో తనతో జనతా గ్యారేజ్ వంటి సూపర్ డూపర్ హిట్ అందించిన కొరటాల శివ తో చేయడనికి సిద్ధం అయ్యారు ఎన్టీఆర్. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న NTR30 మూవీకి సంబంధించి ప్రస్తుతం లొకేషన్ సెర్చింగ్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

భారీ యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ మూవీ గా దర్శకుడు కొరటాల ఈ మూవీని తీయనున్నారట. ఇక ఇప్పటికే మూవీకి వర్క్ చేస్తున్న ఆర్ట్ డైరెక్టర్ సాబు సైరిల్, కెమెరా మ్యాన్ రత్నవేలు ఇద్దరూ కూడా ప్రస్తుతం గోవా లో పలు అద్భుత లొకేషన్స్ వేటలో ఉన్నారట. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించి ఇతర వర్క్ కూడా స్పీడ్ గా జరుగుతుండడంతో అతి త్వరలోనే NTR30 మూవీ పట్టాలెక్కే అవకాశం గట్టిగా కనపడుతోంది. కాగా ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు