కృష్ణా , నైజాంలో ఎఫ్ 2 , వివిఆర్, ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్ల వివరాలు !

Published on Jan 22, 2019 12:11 pm IST


సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ నుండి మూడు పెద్ద సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఎఫ్ 2 ఇప్పటికే బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకోగా మిగిలిన రెండు చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక ఎఫ్ 2 చిత్రం నిన్న కృష్ణా జిల్లాలో 15.86 లక్షల షేర్ ను రాబట్టుకొని 10రోజులకుగాను అక్కడ 3.96 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక వినయ విధేయ రామ నిన్న కృష్ణా లో 1.32 లక్షల షేర్ ను రాబట్టి 11రోజుల్లో అక్కడ 3.67 కోట్ల షేర్ ను రాబట్టింది అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు నిన్న 0.36 లక్షల షేర్ ను రాబట్టి 13రోజుల్లో అక్కడ 1.38కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

ఇక నైజాం లో సోమవారం ఎఫ్2 90లక్షలషేర్ ను రాబట్టగా వినయ విధేయ రామ , ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద చేతులేత్తేసాయి.

సంబంధిత సమాచారం :