19ఏళ్లకే ఎన్టీఆర్ ని మాస్ హీరోని చేసిన చిత్రం.

Published on Mar 28, 2020 11:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో ఆది అతిపెద్ద విజయం సాధించింది. 2002 మార్చి 28న విడుదలైన ఈ చిత్రం నేటితో 18ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ నాలుగవ చిత్రంగా. ఎన్టీఆర్ నాలుగవ చిత్రంగా వచ్చిన ఈ మూవీ అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ గా ఈ మూవీ నిలిచింది. మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ కి ఈ మూవీ ఫస్ట్ మూవీగా కాగా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.

మణిశర్మ సాంగ్స్, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఆది సినిమాకు మరింత ఆకర్షణ చేకూర్చాయి. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా.. అనే డైలాగ్ అప్పట్లో పిచ్చ ఫేమస్. ఆది విజయం ఎన్టీఆర్ కి మాస్ హీరో హోదా తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలయ్యే నాటికి ఎన్టీఆర్ వయసు కేవలం 19ఏళ్లు మాత్రమే. తక్కువ వయసులోనే భారీ ఇమేజ్ ఎన్టీఆర్ ఈ చిత్రంతో సొంతం చేసుకున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More