
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన పుట్టిన రోజు కానుకగా తన అభిమాలనుల కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ ని ఇవ్వనున్నాడని ఇది వరకే తెలియజేశాం. అదే ఎన్.టి.ఆర్ వారసుడైన అభయ్ రామ్ ఫస్ట్ ఫోటో ని రిలీజ్ చెయ్యడం. రేపు ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు కానీ ఈ రోజు బాగుండడంతో ఎ.టి.ఆర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అభయ్ రామ్ ఫోటోని తన ట్విట్టర్ పేజ్ ద్వారా రిలీజ్ చేయనున్నాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నందమూరి మరియు ఎన్.టి.ఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తుండడమే, వెల్ కమ్ అభయ్ రామ్ అనే హాష్ ట్యాగ్ తో (#WelcomeAbhayRam) తో సోషల్ నెట్వర్క్స్ లో ట్రెండ్ చేస్తున్నారు.
నందమూరి అభిమానులంతా ఉదయంనుంచి ఇదే విషయాన్నీ, ట్విట్టర్, ఫేస్ ద్వారా అందరికీ తెలియజేస్తూ, సోషల్ నెట్వర్క్స్ లో ఎన్.టి.ఆర్ అభిమానులు #WelcomeAbhayRam హాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. అభయ్ రామ్ పుట్టినప్పటి నుంచీ ఒక్క ఫోటో కూడా బయటకి రాకపోవడంతో అందరి ఆసక్తిని మరింత పెంచేసింది. మరో గంటలో అభయ్ రామ్ ఫోటోని తారక్ రిలీజ్ చేయనున్నాడు. తెమపార్ తో సక్సెస్ అందుకున్న ఎన్.టి.ఆర్ త్వరలోనే సుకుమార్ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టనున్నాడు.

