ఖరారైన యెన్. టి. ఆర్ వక్కంతం వంశీ చిత్రం

ఖరారైన యెన్. టి. ఆర్ వక్కంతం వంశీ చిత్రం

Published on May 31, 2014 7:10 PM IST

ntr_kalyan
123తెలుగు గతంలో ప్రకటించినట్టుగానే ప్రముఖ రచయిత వక్కంతం వంశీ యెన్. టి. ఆర్ చిత్రంతో దర్శకుడిగా మారబోతున్నాడు. ఈ వార్తని వంశీ స్వయంగా దృవీకరించారు.

ఎన్నో కొత్త కధలతో హిట్లు సాదించిన వంశీ నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్న యెన్. టి. ఆర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం యెన్. టి. ఆర్ కోసమే తీర్చిదిద్దినట్టుగా వుంటుంది. ఆయన ఫాన్స్ ఈ చిత్రాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు అని వంశీ తెలిపారు.

స్క్రిప్ట్ వర్క్ ఇంకా కొనసాగుతుంది ఇంకో పది రోజులలో పూర్తవుతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం లాంచనంగా ప్రారంభమవుతుంది అని తెలిపారు.

న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన వంశీ దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఒక చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత ‘కిక్’ ‘ఉసరవెల్లి’ ‘ఎవడు’ మరియు తాజా బ్లాక్ బస్టర్ ‘రేసు గుర్రం’ చిత్రాలకు కథని అందించారు.

తాజా వార్తలు