“ఓ పిట్ట కథ” నుంచి ఓ ఫీల్ గుడ్ సాంగ్.. ఏమై పోతానే..!

Published on Feb 14, 2020 7:15 pm IST

ఇప్పటివరకు పెద్ద సినిమాలను నిర్మిస్తూ వస్తున్న అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తాజాగా ఓ పిట్ట కథ అంటూ ఓ మంచి కాన్సెప్ట్ మూవీనీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి చందు ముద్దు దర్శకత్వం వహిస్తుండగా, వి.ఆనందప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు, విశ్వంత్ దుద్దుంపూడి హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా ఈ సినిమాలో నటించబోతున్నారు.

అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న ఈ చిత్ర యూనిట్ ఇటీవల అఫిషియల్ టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక లిరికల్ సాంగ్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. “ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే” అంటూ స్లో మోషన్‌లో, క్యూట్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఈ పాటకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించడమే కాకుండా అయనే స్వయంగా పాడారు. అయితే వాలంటైన్స్ డే రోజున రిలీజ్ అయిన ఈ ఫీల్ గుడ్ సాంగ్ యువతను కట్టిపడేస్తుందనే చెప్పాలి. అయితే ఈ సినిమా మార్చి 6వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

లిరికల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

X
More