ఒడియన్ కు తెలుగులో సూపర్ క్రేజ్ !

Published on Dec 4, 2018 5:15 pm IST


‘జనతా గ్యారేజ్,మనమంతా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్. ఆతరువాత ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఇక మలయాళం లో ఆయన నటించిన తాజా చిత్రం ‘ఒడియన్’ కూడా తెలుగులో విడుదలకానుంది. ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. దాంట్లో భాగంగా ఈచిత్రం యొక్క నైజాం , సీడెడ్ హక్కులు ఫాన్సీ రేటుకు అమ్ముడైయ్యాయని సమాచారం. దగ్గుబాటి రామ్ మరియు సంపత్ కుమార్ ఈచిత్ర తెలుగు వెర్షన్ కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ లాల్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. శ్రీకుమార్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రం మళయాళంతో పాటు తెలుగులోనూ డిసెంబర్ 14న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :