అఫీషియల్ : “యశోద” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.!

అఫీషియల్ : “యశోద” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Dec 6, 2022 1:02 PM IST

స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటించిన రీసెంట్ సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “యశోద”. దర్శకులు హరి అండ్ హరీష్ లు తెరకెక్కించిన ఈ చిత్రం అనేక అంచనాలు అయితే నెలకొల్పుకొని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాగా అన్ని భాషల్లో మంచి టాక్ తెచ్చుకొని సమంత కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచి ఆమె బాక్సాఫీస్ స్టామినా చూపించింది. ఈ సినిమాకి తాను పెట్టిన ఎఫర్ట్స్ కి గాను ఈ చిత్రం సాలిడ్ వసూళ్లతో మంచి విజయం అయితే ఆమెకి దక్కింది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై అయితే అధికారికంగా అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రం ఓటిటి హక్కలు సొంతం చేసుకున్న ప్రైమ్ వీడియో సంస్థ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన అన్ని భాషల్లో అయితే ఈ డిసెంబర్ 9 నుంచే స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంచనున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. మరి నెల గడవక ముందే ఈ చిత్రం అయితే ఓటిటి లో వచ్చేస్తుంది. మరి మిస్ అయ్యిన వారు ఇప్పుడు చూడొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు