ఇప్పటివరకూ ‘ఓ బేబీ’కి 35 కోట్లు !

Published on Jul 17, 2019 7:29 pm IST

నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో అంచనాలను అందుకొని ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతూ ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. మొత్తం 10 రోజులకు గానూ ఈ చిత్రం అన్ని ఏరియాల్లో డీసెంట్ రెవిన్యూతో ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లు గ్రాస్ ను సాధించింది.

ఇక యూఎస్ లో కూడా బాక్సాఫీస్ వద్ద తన కలెక్షన్ల ప్రవాహాన్ని ‘ఓ బేబీ’ అలాగే కొనసాగిస్తోంది. 11వ రోజున కూడా 29,845 డాలర్లను వసూలు చేసింది. అలాగే ఇప్పటివరకూ యూఎస్ లో మొత్తం 905,268 డాలర్లను రాబట్టుకుంది. ప్రస్తుతం వస్తోన్న కలెక్షన్స్ ను బట్టి యూఎస్ లో ‘ఓ బేబీ’ ఈజీగా 1 మిలియన్ మార్కును దాటుతుంది. ఓవరాల్ గా ‘ఓ బేబీ’ సమంత కెరీర్ లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం :