“ఒకే ఒక జీవితం” ఫస్ట్ టైం టీఆర్పీ ఇదే.!

“ఒకే ఒక జీవితం” ఫస్ట్ టైం టీఆర్పీ ఇదే.!

Published on Apr 20, 2023 9:14 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి లు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “ఒకే ఒక జీవితం”. దర్శకుడు శ్రీ కార్తీక్ తెలుగు మరియు తమిళ్ భాషల్లో అయితే ఈ సినిమాని తెరకెక్కించాడు. మరి టైం ట్రావెల్ కాన్సెప్ట్ పై అమ్మ ప్రేమ కలగలిపి తీసిన ఈ చిత్రం మూవీ లవర్స్ లో అయితే ఒక అండర్ రేటెడ్ హిట్ సినిమాగా నిలిచింది.

మరి గత కొన్ని రోజులు కితం అయితే తెలుగులో జెమినీ ఛానెల్లో అయితే మొదటిసారి ప్రసారం కి వచ్చింది. దీనితో ఫస్ట్ టైం టెలికాస్ట్ లో 2.08 రేటింగ్ ని రాబట్టింది. ఈ తరహా చిత్రానికి కాస్త తక్కువే అయినా మరింత మంచి ఆదరణ అందుకోడానికి ఈ సినిమా అర్హత కలిగినదే అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో అమల అక్కినేని కీలక పాత్రలో నటించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ సినిమాని డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు