
‘రన్ రాజా రన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ చేస్తున్న కొత్త మూవీ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. శర్వానంద్ ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని ఫినిష్ చెయ్యడమే కాకుండా ఈ సినిమా ఆడియోని కూడా ఇటీవలే రిలీజ్ చేసారు. శర్వానంద్ కి జోడీగా నిత్యా మీనన్ నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే ఈ చిత్ర టీం ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో శర్వానంద్ రన్నర్ గా కనిపించనున్నాడు. అలాగే హిందూ – ముసలీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథ అందరికీ నచ్చేలా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. ‘ఓనమాలు’ ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎ వల్లభ నిర్మిస్తున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో హిట్ అందుకున్న శర్వానంద్ ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడా లేదా అన్నది మరో వారంలో తెలుస్తుంది.

