“వకీల్ సాబ్” స్ట్రీమింగ్ పై కూడా గట్టి అంచనాలు ఉన్నాయ్.!

Published on Apr 29, 2021 7:03 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ సాలిడ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలతో విడుదల కాబడిన ఈ చిత్రం కోవిడ్ లో మంచి వసూళ్లను రాబట్టింది. అయితే క్రమంగా కోవిడ్ ఉదృతి పెరుగుతుండంతో ఈ నెలలోనే ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ ఉన్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు.

మరి అప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఎలా అయితే అంచనాలు ఉన్నాయో ఇప్పుడు ఈ స్ట్రీమింగ్ పై కూడా భారీ అంచనాలు సెట్టయ్యాయి. ప్రైమ్ వీడియోలో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కు రానున్న ఈ చిత్రం ఖచ్చితంగా భారీ వ్యూయర్ షిప్స్ కొల్లగొట్టడం ఖాయం అని ఓటిటి వర్గాలు చెబుతున్నాయి.

ఎలాగో పెద్దగా గ్యాప్ లేకుండా సినిమా ఓటిటిలో వస్తుండడంతో ఇక్కడ కూడా భారీ రెస్పాన్స్ అందుకోడం ఖాయం అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :