ముచ్చటగా మూడోసారి పోలీస్ గా చరణ్.

Published on Apr 2, 2020 8:22 am IST

రాంచరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 13ఏళ్ళు అవుతుంది. 2007 లో చిరుత మూవీతో వెండితెరకు పరిచయమైన చరణ్ ఇప్పటివరకు 12 చిత్రాలు చేశారు.చేసిన కొద్ది సినిమాలలోనే చరణ్ రెండుసార్లు పోలీస్ పాత్ర చేయడం జరిగింది. మొదటిసారి హిందీ చిత్రం జంజీర్ కి రీమేక్ గా ఆయన చేసిన బైలింగ్వల్ మూవీ జంజీర్ లో అసిస్టెంట్ కమీషనర్ రోల్ చేశాడు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ధృవ చిత్రంలో కూడా ఆయన ఐ పి ఎస్ అధికారి పాత్ర చేయడం జరిగింది. ఈ రెండు చిత్రాలలో పోలీస్ గా చరణ్ సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు.

ముచ్చటగా మూడోసారి చరణ్ పోలీస్ గా కనిపించనున్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్ర చేస్తుండగా ఆయన ఓ గెటప్ లో పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. రాజమౌళి చరణ్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన వీడియోలో ఆయన్ని పోలీస్ గానే పరిచయం చేశాడు. అల్లూరి సీతారామ రాజు పోలీస్ ఎలా అయ్యాడు అనేది అంతు బట్టని అంశం. రాజమౌళి ఇది ఓ కల్పిత గాథ అని చెప్పాడు కాబట్టి దీని గురించి ఆలోచించడం అనవసరం. కాబట్టి రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ ద్వారా మూడోసారి పోలీస్ గా కనిపించనున్నాడన్న మాట.

సంబంధిత సమాచారం :

X
More