వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరొకసారి పవన్ కళ్యాణ్?

Published on Apr 27, 2021 7:53 am IST

పవన్ కళ్యాణ్ దాదాపు కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ సూపర్ హిట్ అయింది. అయితే ఈ చిత్రం ను తెరకెక్కించిన వేణు శ్రీరామ్ మరియు దిల్ రాజ్ ల పట్ల పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక వకీల్ సాబ్ ను తెరకెక్కించిన విధానం కూడా పవన్ కళ్యాణ్ ను ఆకట్టుకోవడం తో పవన్ దిల్ రాజు తో మరొక సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం దిల్ రాజ్ వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ ను పవన్ కళ్యాణ్ కోసం మరొక కథను సిద్దం చేయమని కోరారు. అయితే వేణు శ్రీరామ్ సైతం పవన్ కళ్యాణ్ కోసం మరొక కథను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టి లో ఉంచుకొని వేణు శ్రీరామ్ కథను సిద్దం చేస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ కి కథను వినిపించనున్నారు వేణు శ్రీరామ్. అయితే మరో ఇద్దరు దర్శకులకు కూడా దిల్ రాజు కథలను సిద్దం చేయమన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కథలు విన్న అనంతరం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరొకసారి పవన్ కళ్యాణ్ సినిమా కు దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించనున్నారు.

సంబంధిత సమాచారం :