తారక్ క్రేజ్ ఎట్ జపాన్..మళ్లీ అదరగొట్టారు.!

Published on Sep 15, 2020 4:01 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మన దగ్గర ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. తారక్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో అతని డే 1 వసూళ్ల ఫిగర్స్ చెప్తాయి. అయితే ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా కూడా తీయకుండా ఎల్లలు చేరిపేసింది మాత్రం మన టాలీవుడ్ నుంచి తారక్ మాత్రమే అని చెప్పాలి.

తన మెస్మరైజింగ్ స్టెప్పులకు అయితే జపాన్ దేశంలో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. గత రెండు నెలల కితం ఎన్టీఆర్ మాస్ సాంగ్ కు స్టెప్పులేసి టాలీవుడ్ మరియు తారక్ అభిమానుల్లో మంచి హాట్ టాపిక్ అయిన ఒక జపనీయ జంట ఇప్పుడు మరో అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో ముందుకు వచ్చారు.

ఈసారి “కంత్రి” సినిమాలోని వయస్సునామి సాంగ్ ఎంచుకొని దాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు..భార్య భర్తలు ఇద్దరు ఇంటి పనులు చేస్తూ నవ్విస్తూనే తారక్ మరియు హన్సికలు వేసిన స్టెప్పులను అచ్చు గుద్దినట్లు దింపేసి మళ్లీ ఆశ్చర్యపరిచారు. వీళ్ళు చేసిన ఈ కవర్ సాంగ్ తో తారక్ హవా జపాన్ లో మామూలుగా లేదని మరోసారి నిరూపితం అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More