మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సాలిడ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ చిత్రమే “పెద్ది”(Peddi). మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సినిమా నిజానికి ఈ మార్చ్ లోనే రావాల్సి ఉంది కానీ మేకర్స్ ఒక్క నెల వెనక్కు వాయిదా వేశారు.
ఇక ఈ గ్యాప్ లో ఇంకా పాటలు, టీజర్ లాంటివి రావాల్సి ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ కి సాలిడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక నెక్స్ట్ సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది ట్రైలర్ రిలీజ్ కి పర్ఫెక్ట్ టైం ఏంటి అనేది తెలుస్తుంది. నిజానికి మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే పైగా అదే డేట్ ని మేకర్స్ మొదట సినిమా రిలీజ్ కి లాక్ చేశారు. కానీ ఊహించని విధంగా ఆ బిగ్ ట్రీట్ ఆ బిగ్ డేన మిస్ అయ్యింది.
సో ఆ ప్లేస్ ని భర్తీ చేసే సాలిడ్ కంటెంట్ గా పెద్ద ట్రైలర్ తప్ప మరో ఆప్షన్ కనపడదు. అందుకే ‘పెద్ది’ దమ్మెంతో చూపించాలి అంటే ఇంతకంటే బెస్ట్ డేట్ ఇంకొకటి ఉండదు. ఎలాగో ట్రైలర్ లు ఒకటీ రెండు వస్తున్నాయి. సినిమా రిలీజ్ కి నెల ముందే ట్రైలర్ లు కూడా వచ్చిన స్ట్రాటజీ పలు పాన్ ఇండియా సినిమాలకి బాగా వర్కౌట్ అయ్యింది. సో ఇదే స్ట్రాటజీలో పెద్ది ఫస్ట్ ట్రైలర్ కట్ ఆరోజున వస్తుందో లేదో చూడాల్సిందే.
