రిచ్ విజువల్స్ తో అదిరిపోయిన సాహో కొత్త సాంగ్…!

Published on Aug 26, 2019 1:25 pm IST

సాహో యూనిట్ నేడు మూవీ నుండి మరో వీడియో సాంగ్ విడుదల చేయడం జరిగింది. “బేబీ ఓన్ట్ యు టెల్ మీ” అనే రొమాంటిక్, మెలోడీయస్ సాంగ్ అద్భుతంగా ఉంది. కొద్దిరోజుల క్రితం జాక్విలిన్ పెర్నాండెజ్ తో ప్రభాస్ చేసిన బ్యాడ్ బాయ్ సాంగ్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ నేడు ఈ సాంగ్ విడుదల చేయడం జరిగింది. గతంలో వచ్చిన సాంగ్స్ కి భిన్నంగా బేబీ ఓన్ట్ యు టెల్ మీ సాంగ్ ప్రభాస్, శ్రద్దాల మధ్య రొమాంటిక్ గా మరియు మెలోడియస్ గా సాగింది.

సాంగ్ ప్రారంభంలో కారులో ప్రభాస్, శ్రద్దా కపూర్ లతో పాటు అలసిపోయి నిద్రిస్తున్నట్లున్న మురళి శర్మను చూస్తుంటే..,పెద్ద యాక్షన్ అడ్వెంచర్ సన్నివేశం తరువాత ఓ ఆహ్లాదకరమైన జర్నీలో ప్రభాస్, శ్రద్దా లమధ్య వచ్చే సాంగ్ అని అర్థం అవుతుంది. రిచ్ లొకేషన్స్, వండర్ఫుల్ విజువల్స్ తో సాగిన బేబీ ఓన్ట్ యు టెల్ మీ సాంగ్ ఆకట్టుకొనేలా ఉంది.

ఇక సాహో ప్రాజెక్ట్ నుండి మధ్యలో వెళ్ళిపోయిన సంగీత త్రయం శంకర్ ఎహసాన్ లాయ్ లు ఈ పాటకు స్వరాలు సమకూర్చగా, శ్వేతా మోహన్, సిద్దార్ద్ మహదేవన్, శంకర్ మహదేవన్ పాడటం జరిగింది. కృష్ణ కాంత్ రచించారు.

వీడియో సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :