బాలీవుడ్ లో మరో విషాదం..!

Published on Jul 9, 2020 10:01 am IST

బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గొప్ప గొప్ప నటులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. నిన్న బాలీవుడ్ సీనియర్ నటుడు జగదీప్ మరణించారు. జగదీప్ వయసు 81 సంవత్సరాలుగా తెలుస్తుంది. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ షోలే మూవీలో సూర్మ భోపాలి పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.

ఆయన చివరి సారిగా 2012లో వచ్చిన గలి గలి చోర్ హై మూవీలో నటించారు. ఇప్పటికే బాలీవుడ్ లో ఇర్ఫాన్ ఖాన్ మరియు రిషి కపూర్ మరణించడం జరిగింది. ఇక గత నెలలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం వలన చెలరేగిన అసహనం ఇంకా చల్లారలేదు.

సంబంధిత సమాచారం :

More