దసరా డైరెక్టర్ తో మరోసారి నాని మూవీ!

దసరా డైరెక్టర్ తో మరోసారి నాని మూవీ!

Published on Mar 27, 2024 4:46 PM IST

నాచురల్ స్టార్ నాని (Nani) వరుస చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నారు. హాయ్ నాన్న చిత్రం లో చివరిసారిగా కనిపించిన ఈ నటుడు, తదుపరి సరిపోదా శనివారం (Saripodhaa sanivaaram) చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఈ చిత్రం తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వ లో మరొక చిత్రం ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

దసరా చిత్రం వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరి నానికి సూపర్ సక్సెస్ ను అందించింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కి వచ్చిన సక్సెస్ తో మరొక ఛాన్స్ ఇచ్చారు హీరో నాని. వీరి కాంబినేషన్ లో మరొక చిత్రం ఫిక్స్ అని నాని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. దసరా 2 కి సీక్వెల్ కాదని, ఇది వేరే లెవెల్లో ఉంటుంది అని అన్నారు. నాని ఇచ్చిన క్లారిటీ తో ఆడియెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు