స్టార్ హీరో పొలిటికల్ లీడర్ గా నంబర్ ‘వన్’ అంటున్నాడు

Published on Nov 10, 2019 11:33 pm IST

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పొలిటికల్ లీడర్ గా చేస్తున్న చిత్రం వన్. నేడు ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. వేలాది ప్రజాభిమానులకు వేదికపై నుండి అభివాదం చేస్తున్నట్లున్న ఆ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు సంతోష్ విశ్వాన్థ్ ఈ పొలిటికల్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీలక్ష్మీ నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ‘వన్’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గతంలో మమ్ముటి యాత్ర పేరుతో తెరకెక్కిన వైస్సార్ బయో పిక్ లో వైస్సార్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఆయన నటించిన భారీ చిత్రం మామాంగం చిత్రం త్వరలో విడుదల కానుంది. నిన్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదల చేయగా విశేష ఆదరణ దక్కించుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పీరియాడిక్ మూవీ దేశంలోని అన్ని ప్రధాన భాషలలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పద్మ కుమార్ తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :

More