చైనాలో రజిని టికెట్ కౌంటర్ తెరిచారు.

Published on Aug 31, 2019 11:52 am IST

దర్శకుడు శంకర్, రజిని కాంత్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 మంచి విజయమే నమోదు చేసింది. రోబో చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపించగా, అమీ జాక్సన్ హీరోయిన్ గా చేయడం జరిగింది. ఐతే ఈ చిత్ర చైనా విడుదలకు సర్వం సిద్ధం అయినది. వచ్చే నెల 6న 2.0 భారీ ఎత్తున రికార్డు థియేటర్లలో విడుదల చేయనున్నారు.

కాగా ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారట. నేటి నుండి ఆన్లైన్ లో 2.0 టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. గతంలో విడుదలైన రోబో అక్కడ మంచి ఆదరణ దక్కించుకోవడంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి చైనా ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక రజని ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న దర్బార్ మూవీ వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :