2020 ఎన్టీఆర్ మిస్సైనా, చరణ్ మిస్సవ్వడూ..!

Published on Feb 20, 2020 8:53 am IST

ఆర్ ఆర్ ఆర్ విడుదల ఈ ఏడాది జులై 30నుండి 2021 జనవరి 8కి వాయిదా పడింది. దీనితో ఎన్టీఆర్, చరణ్ అభిమానులు వాళ్ళని 2020 లో వెండితెరపై చూడలేమనే వర్రీలో ఉన్నారు. ఐతే చరణ్ అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ఏడాదే చరణ్ ను వెండితెరపై చూడొచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు 152వ చిత్రంగా తెరక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. తాజా షెడ్యూల్ కొరకు గోదావరి జిల్లాలకు చిత్ర యూనిట్ వెళ్లినట్టు తెలుస్తుంది.

ఐతే ఈ చిత్రంలో చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి యువకుడు పాత్ర కోసం కొన్ని సన్నివేశాలలో చరణ్ కనిపించనున్నాడు. కాబట్టి 2020లో వెండితెరపై చరణ్ కనిపించడం ఖాయం. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. తాజా షెడ్యూల్ నందు ఎన్టీఆర్, చరణ్ లతో పాటు హిందీ నటుడు అజయ్ దేవ్ గణ్ పాల్గొంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో నిర్మాత దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More