ఇంకొక్క నెలలో “సాహో” స్ట్రామ్..!

Published on Jul 16, 2019 1:01 am IST

బాహుబలి 2 చిత్రం తర్వాత మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ మీదకు దండెత్తడానికి సిద్ధంగా ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే ప్రస్తుతానికి అది “సాహో” చిత్రమే అని చెప్పాలి.బాహుబలి2 సినిమా తర్వాత రెండేళ్లుగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండంతో అన్ని ప్రముఖ ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇప్పటికే వచ్చిన టీజర్లను చూస్తేనే ఈ సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధం అయ్యిపోతుంది.దేశ వ్యాప్తంగా మరియు హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు పని చేసిన ఎంతో మంది టెక్నిషియన్స్ ను సుజీత్ రంగంలోకి దింపారు.దీనితో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు సహా భారత ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రం బాక్సాఫీస్ మీద దాడి చెయ్యడానికి ఈ రోజు జూలై 15 అంటే ఆగస్టు 15కి ఇంకా సరిగ్గా ఒక్క నెల సమయం మిగిలి ఉంది.దీనితో అభిమానులు ఇప్పటి నుంచే హడావుడి మొదలు పెట్టేసారు.మరి మిగిలిన ఈ ఒక్క నెలలో సాహో బృందం నుంచి రావాల్సినవి చాలానే బాకీ ఉన్నాయి.మరి సుజీత్ అండ్ టీమ్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More