ఆత్మహత్య చేసుకోవద్దు – శ్రీకాంత్.

Srikanth
తన ఇద్దరు కుమారులు విఠల్ విరించి, నందవిహరిలను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గురుప్రసాద్ చర్య పట్ల హీరో శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నతండ్రే కుమారుల పట్ల కాలయముడిగా మారడం దారుణం అని అన్నారు.

ఈ రోజు ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ… తమ కలహాలు, గొడవలలో పిల్లలను బలి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇది చాలా బాధకరమైన సంఘటన. జీవితంలో కష్టసుఖాలు పగలు, రాత్రి లాంటివి. వైవాహిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి, అంతే కాని ఆత్మహత్య చేసుకోవద్దు. విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అని అన్నారు.

కన్నబిడ్డలను తండ్రి కడతేర్చాడంటే భారతీయ కుటుంబ బాంధవ్యాలు ,మానవీయ విలువల గురించి ఆందోళనగా వుంది.చిన్నారులకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నా. అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Exit mobile version