సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా “ఊ అంటావా మామ.. ఊఊ అంటావా”..!

Published on Dec 21, 2021 1:55 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “పుష్ప”. డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సమంత ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సమంత చిందేసిన ఈ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతూ రికార్డ్ వ్యూస్‌ని కొల్లగొడుతుంది.

అయితే తాజాగా ఈ పాట అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది చివరలో వచ్చిన ఈ పాట సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారిపోయింది. ఈ పాట విడుదలైన 20 రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి 100ప్లస్ మిలియన్ వ్యూస్‌ని సాధించింది. ఇదిలా ఉంటే ఈ పాటకు దేవి శ్రీప్రసాద్ క్యాచీ ట్యూన్, సింగర్ ఇంద్రావతి వాయిస్ అందించింది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :