ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో అది కూడా తెలుగు – తమిళ స్టార్స్ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఊపిరి’. కింగ్ నాగార్జున – తమిళ యంగ్ హీరో కార్తీ కాంబినేషన్ లో రానున్న ఈ మల్టీ స్టారర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే ఈ చిత్ర టీం లండన్ లో ఓ మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చి హైదరాబాద్ లో ఓ షార్ట్ షెడ్యూల్ ని ఫినిచ్ చేసారు.
ప్రస్తుతం నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ షూటింగ్ లో బిజీగా ఉండడం వలన ఊపిరి సినిమాకి బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్ర టీం నుంచి అందుకున్న సమాచారం ప్రకారం 25-30 రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. కావున నవంబర్ చివరికల్లా సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ఈ సినిమా రిలీజ్ కి ఓ పర్ఫెక్ట్ డేట్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. నాగార్జున ఈ సినిమాలో ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క – అడవి శేష్ జంటగా కనిపించనున్నారు.
ఇప్పటికే 80% పైన షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్’ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్.


