
తెలుగు – తమిళ స్టార్స్ అయిన కింగ్ నాగార్జున – యంగ్ హీరో కార్తీ కాంబినేషన్ లో ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో రానున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఊపిరి’. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా ఒక నెల రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ప్రస్తుతం నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ షూటింగ్ లో బిజీగా ఉండడం వలన ఊపిరి సినిమాకి బ్రేక్ ఇచ్చారు.
ఈ చిత్ర టీం నుంచి అందుకున్న సమాచారం ప్రకారం బాలన్స్ ఉన్న 25-30 రోజుల షూటింగ్ ని ఈ నెలాఖరున మొదలు పెట్టి కంటిన్యూగా షూట్ చేసి నవంబర్ చివరికల్లా ఫినిష్ చేయనున్నారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి మరో నెల రోజుల సమయం పడుతుంది. ముందుగా ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నా షూటింగ్ లో జాప్యం వలన వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ పూర్తయ్యాక అధికారికంగా ఓ డేట్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉంది. నాగార్జున ఈ సినిమాలో ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క – అడవి శేష్ జంటగా కనిపించనున్నారు.
ఇప్పటికే 80% పైన షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్’ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్.

